Monday, December 23, 2024

ఉద్యోగాల బాధ్యత మాదే: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ నిరుద్యోగుల, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రాష్ట్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బావి దగ్గర ఉచిత కరెంటు అని చెప్పి ఇంటి దగ్గర కరెంటు బిల్లు వసూల్ చేస్తున్నాడని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయభేరీ ర్యాలీలో పాల్గొని.. రెడ్డిపేట కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశపడిందని… కానీ, యవత ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారని అన్నారు. ఉద్యోగాలు రాక యువకులు ఆత్మహత్య చేసుకుంటే… ఏ బాధిత కుటుంబాన్నైనా కేసీఆర్ పరామర్శించారా? అని ప్రశ్నించారు.

కేసీఆర్ మళ్లీ వస్తే ఉద్యోగికి చేటు అని… కేసీఆర్ ఉన్నంతవరకు యువతకు ఉద్యోగాలు రావన్నారు. కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టేందుకే తాను కామారెడ్డికి వచ్చానని చెప్పారు. కాంగ్రెస్ ను గెలిపించండి.. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటామన్నారు. పేద రైతుల భూములు గుంజుకున్నరని మండిపడ్డారు. కామారెడ్డిని దోచుకోవడానికి కేసీఆర్ వస్తున్నాడని… మీకు అండగా ఉండేందుకే ఇక్కడికి వచ్చానన్నారు. కామారెడ్డి రైతుల భూములు కాపాడే బాధ్యత తనదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.4వేల ఫించన్ ఇస్తామని.. రైతు భరోసా కింద రైతులను ఆదుకుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News