Monday, December 23, 2024

దేశంలో మతతత్వ శక్తులు చిచ్చు పెడుతున్నారు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Revanth Reddy speech in 76th Independence Celebrations

హైదరాబాద్: బ్రిటిష్ వారి నుంచి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం నడిచిందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు.  76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి గాంధీభవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు.  పెద్దఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారని, లక్షలాది మంది  జైళ్ల పాలు అయ్యారని, వేలాది మంది ప్రాణత్యాగాలు చేశారని ప్రశంసించారు.  బ్రిటిష్ వారిని తరిమి కొట్టి ప్రజలకు స్వేచ్ఛ వాయువులు అందించి స్వతంత్రాన్ని తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని కొనియాడారు.  మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్, నెహ్రు లాంటి వాళ్ళు ఎంతో మంది ఉద్యమాల ఫలితం నేటి స్వాతంత్రమని కొనియాడారు. పోరాట ఫలితంగా వచ్చిన స్వాతంత్ర్యంతో ఒకవైపు ఆనందం, మరోవైపు దేశ విభజన విషాదమన్నారు.

మత కల్లోలాలు, దేశ విభజన నేపథ్యంలో దేశంలో తొలి ప్రధానిగా నెహ్రు దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో తన దూర దృష్టి, విజ్ఞానం తో ఎంతో కృషి చేశారని రేవంత్ రెడ్డి మెచ్చుకున్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో 140 కోట్ల ప్రజలు 75 ఏళ్ల నుంచి హక్కులు, బాధ్యతలతో దేశంలో స్వేచ్ఛగా జీవిస్తున్నారని,  భిన్నత్వంలో ఏకత్వం, మత సామరస్యం, అభివృద్ధి, నైపుణ్యంతో దేశాన్ని శక్తి వంచన లేకుండా నెహ్రు దేశాన్ని ముందుకు నడిపారన్నారు.  దేశం కోసం మహాత్మాగాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లు ప్రాణ త్యాగాలు చేశారని,  దేశాన్ని కడు పేదరికం నుంచి నేడు ప్రపంచంలో ఒక శక్తి వంతమైన దేశంగా నిర్మించడంలో కాంగ్రెస్ ప్రధాన మంత్రులు చేసిన కృషి మరువలేనిదన్నారు. దేశంలో ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించి ప్రజలను ఆత్మ గౌరవంతో బతికేల తీర్చిదిద్దిన ఘనత వారిదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

అలాగే 60 ఏళ్లుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన పోరాటాన్ని గుర్తించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకే దక్కుతుందన్నారు. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలతో కోట్లాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పాలకులదని,  దేశ ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్న గుర్తించి సమన్వయంతో పని చేసి ప్రజల మనసులలో మంచి స్థానం సంపాదించామని,  కానీ నేడు దేశంలో మతతత్వ శక్తులు చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయని మండిపడ్డారు.  ఎన్నో పోరాటాలు ఎంతో శ్రమకు ఓర్చి నిర్మించిన ఈ దేశంలో మళ్ళీ విభజించి లబ్ది పొందే చర్యలను మనం ప్రతిఘటించాలన్నారు. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం లో పటిష్టమైన పోరాటంతో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News