Tuesday, January 7, 2025

పాలమూరు జిల్లా అభివృద్ధిని అడ్డుకోవద్దు: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

కేసీఆర్‌ను పాలమూరు ప్రజలు పార్లమెంట్‌కు పంపింతే.. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్‌ మహబూబ్ నగర్‌ జిల్లాకు ఏం చేశారని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదని, పరిశ్రమలు రాలేదని.. దాంతో జిల్లాలో వలసలు కొనసాగుతున్నాయన్నారు. మహబూబ్ నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. సీఎం వెంట మంత్రులు కోమటిరెడ్డి, దామోదర రాజనర్సింహ ఉన్నారు. కురుమూర్తి స్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయం వద్ద రూ.110 కోట్ల అంచనాతో ఘాట్‌రోడ్డు ఎలివేటెడ్ కారిడార్‌కు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“అధికారంలో ఉన్నప్పుడు మీ నియోజకవర్గాలకు నిధులు తీసుకుపోయినప్పుడు మేం అడ్డుపడలేదు. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది. మా జిల్లా అభివృద్ధిని అడ్డుకోవద్దు. ఒకవేళ అడ్డుపడితే మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు మిమ్మల్ని క్షమించరు. నాపై కోపం ఉంటే వేరే రకంగా రాజకీయంగా కక్ష్య తీర్చుకోడి. ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రతినెలా జిల్లా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తున్నాం. త్వరలోనే మక్తల్, నారాయణ్ పేట్, కొడంగల్ ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయి. అపర భగీరథ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు కొంతమంది దుర్మార్గులు కుట్రలు చేస్తున్నారు. వలసలు ఆపాలని నేను ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారు: అని సీఎం రేవంత్ దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News