Sunday, January 19, 2025

బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది.. నాణ్యమైన 24 గంటల కరెంటు ఇస్తాం: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనం కోరుకున్న తెలంగాణ రాలేదని.. తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చిండని కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రజలకు చేసింది ఏం లేదని, నమ్మించి మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వర్ధన్నపేట నియోజకవర్గంలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

“ఆంధ్రలో అధికారం కోల్పోతామని తెలిసినా.. సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చింది. యువకులకు ఉద్యోగాలు రావాలని సోనియా తెలంగాణ ఇచ్చారు. కాంగ్రెస్ వస్తే.. రైతుబంధు ఆపుతారని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఉపాధి హామీ కూలీకి వెళ్లే ప్రతి ఒక్కిరికీ ఏడాదికి రూ.12వేలు ఇస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తాం. ఇల్లు కట్టుకునేందుకు పేదలకు రూ.5 లక్షలు ఇస్తాం. విద్యార్థుల చదువుల కోసం రూ.5లక్షల గ్యారంటీ కార్డు ఇస్తాం. అవినీతి, కుటుంబ పాలనను తరిమికొట్టాలంటే.. అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది. కాంగ్రెస్ ను గెలిపించి.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి” అని రేవంత్ రెడ్డి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News