Friday, January 10, 2025

పెట్టుబుడులు పెట్టేందుకు ప్రభుత్వంతో కలిసి వస్తే అద్భుతాలు సృష్టించవచ్చు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి సంబంధించి మాకో కల ఉందని, అదే తెలంగాణ రైజింగ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇతర దేశాల్లోని నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుందన్నారు. సిఐఐ జాతీయ కౌన్సిల్ సమవేశాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గ్రీన్ బిజినెస్ సెంటర్‌లో సిఎం మొక్కలు నాటారు. హైటెక్ సిటీలోని సిఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్‌లో సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత సిటీగా చేయాలని తాము లక్షం పెట్టుకున్నామని స్పష్టం చేశారు.

3200 ఇవి బస్సులను ఆర్‌టిసిలోకి తీసుకున్నామని, ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్నును తొలగించామని, ప్రకృతి విపత్తులను ఎదుర్కొవడానికి హైదరాబాద్ సిద్ధమౌతోందని, వరదలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలనుకుంటున్నామని రేవంత్ తెలియజేశారు. ఒఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ అనుసంధానించే రేడియల్ రోడ్లను కూడా నిర్మించబోతున్నామని, ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య తయారీ రంగానికి కేంద్రంగా ఉండబోతుందని, నైపుణ్యాలు, ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించామని, తెలంగాణకు తీర ప్రాంతం లేకపోవడంతో డ్రైపోర్టు ఏర్పాటు చేయలనుకుంటున్నామని వివరణ ఇచ్చారు. పెట్టుబుడులు పెట్టేందుకు ప్రభుత్వంతో కలిసి వస్తే అద్భుతాలు సృష్టించవచ్చని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News