Friday, January 10, 2025

సొంత పార్టీ నేతలపై వ్యతిరేక పోస్టులు పెడతామా?: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో హైడ్రామా క్లైమాక్స్‌కు చేరాయి. గాంధీ భవన్‌లో టిపిసిసిస ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ముగిసింది. సమావేశానికి హాజరుకాకుండా సీనియర్లు నిరసన తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. రేవంత్ రెడ్డి వర్గం పిసిపి పదవులకు రాజీనామా చేసింది. టిడిపి నుంచి వచ్చినవారికే పదవులు అంటూ సీనియర్ల విమర్శలు చేసిన నేపథ్యంలో 12 మంది నేతలు రాజీనామా చేశారు.

ఈ సందర్భంగా టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. భారత్ జోడోయాత్రపై సమావేశంలో చర్చించామని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. హైకమాండ్ ఆదేశాలతో మీటింగ్ నిర్వహించామని, ఈ నెల 20 నుంచి 24 వరకు అన్ని జిల్లాల్లో సమీక్ష సమావేశాలు జరుపుతామన్నారు. కాంగ్రెస్ నేత, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ఎలా చెప్పారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలపై ఎవరైనా వ్యతిరేక పోస్టులు పెడతారా? అని అడిగారు. తనపై ఉన్న అపోహలను తీసేయండని, నమ్మకంతో పని చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. కావాలనే కొందరు తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News