Monday, January 20, 2025

రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి: పోచారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి అని, రైతుల కోసం పాటుపడే వ్యక్తి అని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రేవంత్‌రెడ్డి స్వయంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్ సమక్షంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పోచారం మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి రైతులకు మంచి చేస్తున్నారని ప్రశంసించారు. రేవంత్ చేపడుతున్న రైతు అనుకూల పనులకు గర్విస్తున్నామని, రేవంత్ యువకుడు అని, మరో 20 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించే సత్తా ఉందని పోచారం మెచ్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News