Monday, December 23, 2024

భీమవరంలో రేవంత్ రెడ్డి వియ్యంకుడి సంబరాలు

- Advertisement -
- Advertisement -

రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతుండడంతో ఎపిలోనూ సంబరాలు జరుపుకున్నారు. రేవంత్ రెడ్డి వియ్యంకుడు వెంకట్ రెడ్డి ఊరు.. తూర్పుగోదావరి జిల్లా భీమవరంలోనూ సంబరాలు జరుపుకున్నారు.

భీమవరంలోని వెంకట్ రెడ్డి నివాసంలో టపాసులు కాల్చి స్వీట్లు పంచారు. రేవంత్ రెడ్డి తన కూతురిని..వెంకట్ రెడ్డి కుమారుడికి ఇచ్చి వివాహ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు(గురువారం) హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యమానికి రేవంత్ రెడ్డి వియ్యంకుడు వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News