Thursday, January 23, 2025

అన్నీ మంచి శకునములే! నేడే సిఎంగా రేవంత్ ప్రమాణస్వీకారం?

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేస్తారని విశ్వసనీయ వర్గాల కథనం. ఉదయం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత అధిష్ఠానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది గవర్నర్ కు సమాచారం అందిస్తారు. భట్టి విక్రమార్కతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరుల పేర్లు ముఖ్యమంత్రి పదవికోసం పోటీ పడుతున్నవారి జాబితాలో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు శ్రమించిన రేవంత్ రెడ్డివైపే అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.

డిసెంబర్ 9న లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని రేవంత్ రెడ్డి స్వయంగా పలుమార్లు ప్రకటించినా, ఆదివారం నాడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ తోపాటు ఉప ముఖ్యమంత్రి, మరో రెండు కేబినెట్ మంత్రి పదవుల భర్తీ కూడా సోమవారమే ఉంటుందనీ, ఈమేరకు వారు కూడా రేవంత్ తోపాటే ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందనీ తెలుస్తోంది.. కొత్త మంత్రివర్గ ప్రమాణాస్వీకారానికి ముందు ప్రస్తుత అసెంబ్లీని గవర్నర్ రద్దు చేయాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News