Saturday, December 21, 2024

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార సమయంలో మార్పు..

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున్న చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వ. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే సమయంలో మార్పు చోటుచేసుకుంది. తొలుత గురువారం ఉదయం 10.30గంటలకు ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించాలనుకున్నారు. తాజాగా ఈ కార్యక్రమాన్ని మధ్యహ్నం 1.04ని మార్చారు.

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి, మంత్రి మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై అధికారులతో సిఎస్ సమావేశం నిర్వహించి సమీక్షించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఎస్ కోరారు. ప్రమాణస్వీకారానికి వచ్చే వారికి తగిన బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News