Thursday, January 9, 2025

రెండు ఎమ్మెల్సీ సీట్లు కావాలంటున్న సిపిఐ

- Advertisement -
- Advertisement -

సిపిఐకి కొత్తగూడెం సీటు కేటాయించేందుకు కాంగ్రెస్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తుపై చర్చించేందుకు సోమవారం సాయంత్రం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సిపిఐ కార్యాలయానికి వెళ్లనున్నారు. కొడంగల్ లో నామినేషన్ వేసిన అనంతరం, ఆయన నేరుగా సిపిఐ కార్యాలయానికి వెళ్ళి, చర్చలు జరుపుతారు.

సిపిఐకి కొత్తగూడెంతోపాటు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్ ఇప్పటికే అంగీకరించింది. అయితే మరొక సీటు కేటాయించాలని సిపిఐ కోరుతున్న నేపథ్యంలో చర్చలు జరగనున్నాయి. చర్చల అనంతరం సాయంత్రం ఇరుపక్షాలు ఒక అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News