Monday, December 23, 2024

నేడు ఢిల్లీకి రేవంత్

- Advertisement -
- Advertisement -

మంత్రిమండలి విస్తరణ, నామినేటెడ్ పదవులు భర్తీపై
అధిష్టానంతో చర్చించే ఛాన్స్

మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. మరోసారి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లడంపై రకరకాల ఊహాగా నాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఆయన ఇంకా పెండింగ్‌లో ఉన్న మంత్రిమండలి విస్తరణ, నామినేటెడ్ పదవులు భర్తీపై కూడా అధినాయ కత్వంతో చర్చిస్తారనే ప్రచారం నడుస్తోంది. గురువారం ఢిల్లీలో ఎఐసిసి భేటీ కానుంది. లోక్ సభ ఎన్నికలపై ఈ మీటింగ్‌లో చర్చించ నున్నారు. ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహలపై రాష్ట్ర నాయకత్వానికి కాంగ్రెస్ హైకమాండ్ దిశానిర్దేశం చేయనుంది. అందులో భాగంగా వివిధ రాష్ట్రాల సిఎంలు, పిసిసి చీఫ్‌లతో అధిష్టానం సమావేశం కానుంది.

ఈ భేటీలో పాల్గొనేందుకు రేవంత్ ఢిల్లీ వెళ్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వైఎస్ షర్మిల సైతం హస్తినకు వెళుతున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. గురువారం వైఎస్సార్‌టిపిని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో రేవంత్ ఢిల్లీకి వెళుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడుసార్లు ఢిల్లీకి వెళ్లారు.

గత ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. రేవంత్‌తో పాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క కూడా మోడీని కలిశారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో మర్యాదపూర్వకంగా మోడీని కలిశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై మోదీతో చర్చించారు. ఆ పర్యటన తర్వాత ఇప్పుడు మళ్లీ హస్తినకు రేవంత్ వెళుతున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్న క్రమంలో రేవంత్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News