Wednesday, February 12, 2025

తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Revanth Reddy Unveil Telangana Talli Statue

హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి నూతనంగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశానికి, తెలంగాణకు స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్సేనని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించిందన్నారు. ఎందరో మహానుభావుల వీరోచిత పోరాటాలతో పెత్తందారులను, భూస్వాములను తరిమికొట్టారని రేవంత్ పేర్కొన్నారు. హైదరాబాద్ కు విమోచన కల్పించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నివాళి అర్పించే నైతిక హక్కు బిజెపికి లేదని ఆయన ఆరోపించారు.  ప్రస్తుతం తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News