Friday, December 20, 2024

బిర్ల టెంపుల్ కు థాక్రే, రేవంత్.. గ్యారంటీ కార్డుతో ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో రేపు(నవంబర్ 30) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని రాష్ట్ర ఇంఛార్జీ మాణిక్ రావ్ థాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు బుధవారం హైదరాబాద్ లోని బిర్ల టెంపుల్ ను సందర్శించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల కార్డును వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత నాంపల్లి దర్గా వద్ద రేవంత్ రెడ్డి ప్రార్థనలు చేశారు. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

కాగా, డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలవడనున్నాయి. ఆ రోజు పోటీ చేసిన రాజకీయ పార్టీల భవితవ్యం తేలిపోయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News