Monday, January 27, 2025

పెద్దమ్మతల్లిని దర్శించుకున్న రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేరుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్ పెద్దమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పెద్దమ్మ గుడి నుంచి నేరుగా ఆయన ఎల్‌బి స్టేడియానికి చేరుకోనున్నారు. ఎల్‌బి స్టేడియంలో సిఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకారానికి ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. ఎల్‌బి స్టేడియంలో ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను డిజిపి రవిగుప్తా, సిపి సందీప్ శాండిల్య, సిఎస్ శాంతి కుమారి పరిశీలించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News