Monday, December 30, 2024

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న రేవంత్

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటంబ సభ్యులతో కలిసి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రికి అర్చకులు వేదాశీర్వచనం చేసిన అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. హైదరాబాద్ నుంచి యాదిగిరిగుట్టకు సిఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్‌లో వచ్చారు. రేవంత్‌రెడ్డి మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం వలిగొండ మండల సంగెం గ్రామ శివారులోని భీమలింగం కత్వ నుంచి మూసీ నది వెంట సిఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తారు. భువనగిరి మండలం మీదుగా బొల్లెపల్లి నుంచి వలిగొండ మండలం సంగెం సమీపంలోని భీమలింగం కత్వ వద్దకు చేరుకుంటారు. భీమలింగం, ధర్మారెడ్డి కాల్వల్ని సందర్శిస్తారు. అనంతరం మూసీ పరీవాహక ప్రాంత రైతులతో సమావేశం అవుతారు. ప్రభుత్వం మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో మూసీ నది వెంట సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News