Thursday, January 23, 2025

తండ్రి బాటలోనే కూతురు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

జగిత్యాలః సిఎం కెసిఆర్ అబద్దపు హామీలతో దేవుళ్లను, భక్తులకు మోసం చేస్తున్నారని, కొండగట్టులో ప్రకటించిన రూ.600 కోట్లు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామంలో భస చేసిన రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రేవంత్‌రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ఆంజనేయ స్వామి సన్నిధిలో రేవంత్‌రెడ్డి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ప్రజలను అబద్దపు హామీలతో మోసం చేస్తున్నారని, తండ్రి బాటలోనే కూతురు నడుస్తుందని అన్నారు.

హనుమాన్ చాలీసా కార్యక్రమం చేపట్టిన కవిత కొండపై 125 అడుగుల రాజన్న విగ్రహం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిందని, ఇక్కడ పలువురు తన దృష్టికి తీసుకువచ్చినట్లు రేవంత్ తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకుని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. గత నెల 6న ప్రారంభమైన జోడో యాత్రకు మంచి స్పందన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి తాటిపర్తి జీవన్‌రెడ్డి, ములుగు ఎంఎల్‌ఎ సీతక్క, మాజీ ఎంపిలు పొన్నం ప్రభాకర్ గౌడ్, అంజనీప్రసాద్ యాదవ్, దొంగ ఆనందరెడ్డి, దారం ఆదిరెడ్డి, బత్తిని శ్రీనివాస్ గౌడ్, చారి, శంకర్ గౌడ్, ఎండి ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News