Friday, November 15, 2024

వనదేవతలను దర్శించుకున్న రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

తాడ్వాయిః రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్, మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఎనుముల రేవంత్‌రెడ్డి తలపెట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర విజయవంతం అవ్వాలని తాడ్వాయి మండలం మేడారంలో కొలువుదీరిన వనదేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్థానిక ఎంఎల్‌ఏ సీతక్క, భద్రాచలం ఎంఎల్‌ఏ పొదెం వీరయ్యలు దగ్గరుండి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డికి దేవాదాయశాఖ అధికారులు డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దర్శనం అనంతరం రేవంత్‌రెడ్డి కాన్వాయి కొత్తూరు, నార్లాపూర్, వెంగళాపూర్ మీదుగా గోవిందరావుపేట మండలం ప్రాజెక్టునగర్‌కు చేరుకుంది. అక్కడ భోజన విరామం తర్వాత పస్రా వెళ్ళారు. అంతకుముందు తాడ్వాయి మండల కేంద్రానికి చేరుకున్న రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మండల శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి వెంట మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపి అంజన్‌కుమార్ యాదవ్, మాజీ ఎంఎల్‌ఏ తాటి వెంకటేశ్వర్లు, ఎర్రబెల్లి స్వర్ణ, వరద రాజేశ్వర్‌రావు, చందా లింగయ్య, స్థానిక మండలాధ్యక్షుడు జాలపు అనంతరెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు బొల్లు దేవేందర్, తాడ్వాయి సర్పంచ్ ఇర్ప సునీల దొర, కామారం సర్పంచ్ రేగా కళ్యాణి, పాక సాంబయ్య, పాక రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News