Monday, December 23, 2024

18న రాజంపేటకు రేవంత్‌రెడ్డి రాక

- Advertisement -
- Advertisement -

రాజంపేట: ఈనెల 18న హథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా రాజంపేట మండల కేంద్రంలో నిర్వహించే కార్యక్రమానికి రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, పిసిసి కన్వీనర్ మహ్మద్ అలీ షబ్బీర్ వస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాద్యక్షులు మద్ది చంద్రకాంత్‌రెడ్డి, మండల పార్టీ అద్యక్షులు యాదవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పెద్దత్తున తరలివచ్చి హథ్ సే హాథ్ జోడో యాత్రను విజయవంతం చేయాలని కోరారు. నూతన మండలానికి రేవంత్‌రెడ్డ్టి రాకతో నాయకులు భారీ ఎర్పాట్లు చేస్తున్నారు.
మహ్మద్ అలీ షబ్బీర్‌కు తీర్థ ప్రసాదలు అందజేత.
రాజంపేట మండల యువజన అద్యక్షులు అంకం కృష్ణరావు బుదవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిసిసి కన్వీనర్ మహ్మద్ అలీ షబ్బీర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి శూబాకాంక్షలు తెలిపారు. తిరుపతి, శ్రీ కాళహస్తిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్బంగా 2024 ఎన్నికలలో షబ్బీర్‌అలీ భారీ మెజారిటితో విజయం సాదించాలని ప్రత్యేక పూజలు నిర్వహించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వీరన్న పటేల్, మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు యాదవరెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News