Saturday, November 23, 2024

కెసిఆర్ పై ఇడి, సిబిఐ కాదుకదా ఈగ కూడ వాలదు: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాళేశ్వరాన్ని సిఎం కెసిఆర్ ఎటిఎంలా వాడుకున్నారని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం సరిపోలేదని ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు పాల్పడ్డారని మండిపడ్డారు. మద్యం కేసులో బిజెపి, బిఆర్‌ఎస్ నాటకాలాడుతున్నాయని, ఎంఎల్ సి కవితను అరెస్ట్ చేసి సానుభూతి పొందాలని చూస్తున్నారని, వచ్చే ఎన్నికలలో గెలిచేందుకు కుమార్తెను జైలుకు పంపేందుకు సిద్ధమయ్యారని చురకలంటించారు. బిఆర్‌ఎస్ నేతలకు కాంగ్రెస్ విమర్శించే అర్హత లేదని, కాంగ్రెస్ అడ్డుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వ్యయం కన్నా ప్రకటనల ఖర్చే ఎక్కువగా ఉందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడిని ఎందుకు చేశారో కిషన్ రెడ్డికి తెలుసా? అని ప్రశ్నించారు. కెసిఆర్ ప్రభుత్వంపై ఇప్పటి వరకు ఇడి, సిబిఐ కాదుకదా ఈగ కూడ వాలలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాలు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై విమర్శలు చేస్తారు కానీ ఒక్క కేసు కూడా పెట్టలేదని మండిపడ్డారు.

Also Read: బ్రెజిల్‌లో కుప్పకూలిన విమానం: 14 మంది మృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News