Monday, January 27, 2025

అలా ఓట్లు అడిగేందుకు బిఆర్‌ఎస్ సిద్ధమా?: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ ఎప్పుడూ దిగజారుడు రాజకీయాలేనని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేద్దామని సిఎం కెసిఆర్‌ను సవాల్ విసిరి అక్కడికి వెళ్తే రేవంత్ ను పోలీసులు అరెస్టు చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఏమైందో ప్రజలు చూశారని చురకలంటించారు. డబ్బు, మద్యంతో ఉప ఎన్నికలు గెలిచిన చరిత్ర బిఆర్‌ఎస్‌ది అని, డబ్బు, మద్యం పంచి ఎన్నికలు గెలవాలని తాము ఎప్పుడూ అనుకోలేదన్నారు. రేపటి ఎన్నికల్లో సిద్ధాంతాలు ప్రచారం చేసి ఓట్లు అడుగుతామని, మ్యానిఫెస్టో చూపించి ఓట్లు అడిగేందుకు బిఆర్‌ఎస్ సిద్ధమా? అని సవాల్ విసిరారు.

కాంగ్రెస్ మాత్రం ఆరు గ్యారంటీలు ప్రచారం చేసే ఓట్లు అడుగుతుందని, అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేద్దామని సిఎం కెసిఆర్‌ను ఆహ్వానించానని, రాష్ట్ర ప్రజలకు మంచి సంప్రదాయం అందిద్దామని కెసిఆర్‌ను పిలిచానని, కెసిఆర్ నిజమైన ఉద్యమకారుడైతే తమ సవాల్‌ను స్వీకరించాలన్నారు. గన్‌పార్క్ వద్ద తనని అరెస్టు చేయాల్సిన అవసరం ఏమిటి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిఎం కెసిఆర్ ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. డబ్బు, మద్యం పంచి ఎన్నికల్లో గెలవాలనేది సిఎం కెసిఆర్ ఆలోచన అని, నిధులు నియామకాలు అన్నీ సిఎం కెసిఆర్ ఇంటికే వెళ్తున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎక్కడ డబ్బు దొరికినా కాంగ్రెస్‌దే అంటూ బురద జల్లుతున్నారని, ప్రవళిక ఆత్మహత్యపై అనేక అబద్దాలు ప్రచారం చేశారని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News