Monday, January 20, 2025

రైతులకు పది గంటల కరెంట్ ఇవ్వడంలేదు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రైతులతో బిఆర్‌ఎస్ రాజకీయాలు చేస్తోందని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రైతులకు టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం ఇక రైతు రుణమాఫీ చేయదని స్పష్టమైందన్నారు. ఎన్నికల వేళ పోడు పట్టాలపై హడావుడి చేస్తున్నారని దుయ్యబట్టారు. 11.5 లక్షల మంది గిరిజనులు పోడు పట్టాలకు అర్హులని తేలిందని, కేవలం నాలుగు లక్షల మందికే పోటు పట్టాలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులకు పది గంటల కూడా ఉచిత విద్యుత్ ఇవ్వట్లేదని, సబ్ స్టేషన్లలో లాగ్‌బుక్‌లే దీనికి నిదర్శమన్నారు. ఆధారాలు బయటపడడంతో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉలిక్కిపడిందన్నారు. అందుకే అన్ని సబ్‌స్టేషన్లలో లాబ్‌బుక్‌లను తెప్పించుకుందని, రైతు వేదికల్లో బిఆర్‌ఎస్ నేతలు నిలదీయాలని పిలుపునిచ్చారు. రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నారు.

Also Read: చిరుతతో పోరాడిన రైతు… బైక్‌కు కట్టుకొని… వీడియో వైరల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News