హైదరాబాద్: పదేళ్లలో ప్రజలను బానిసలుగా చూసే పాలన సాగిందని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోసమే పోరాటం చేశారని, ఈ ఎన్నికలే తెలంగాణ చివరి దశ ఉద్యమం కావాలని పిలుపునిచ్చారు. తుదిదశ ప్రజా ఉద్యమంలో మీడియా పాత్ర కీలకం కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రాంతాలను భట్టి ప్రాధాన్యతలు మారుతాయని, సిఎం కెసిఆర్ ఇచ్చే ఫించన్ల కంటే కర్నాటకలో ఎక్కువ ఇస్తున్నారని, మేనిఫేస్టోలో బిఆర్‌ఎస్ ఐదు వేల రూపాయలు ఇస్తామని పెట్టిందని, తొమ్మిదేళ్ల నుంచి ఎందుకు ఇవ్వలేదని రేవంత్ అడిగారు. ఎస్‌సి వర్గీకరణపై గతంలోనే బిజెపి హామీ ఇచ్చిందని, కెసిఆర్ కుటుంబ పెత్తనాన్ని ఇన్నాళ్లు ప్రజలు భరించారని, నిజాం తరహా పాలన ఇన్నాళ్లు కొనసాగిందని విమర్శలు గుప్పించారు. నిజాం హయాం నుంచి జరిగిన పోరాటాలు భూమి కోసమేనని, నిజాం పాలనలో ఆకలిని భరించారు కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదని రేవంత్ పేర్కొన్నారు. సమైక్య పాలనలో మనపై ఆధిపత్యం కొనసాగిందని గుర్తు చేశారు.
రూ.5 వేల ఫించన్ 9 ఏళ్ల నుంచి ఎందుకు ఇవ్వలేదు: రేవంత్
- Advertisement -
- Advertisement -
- Advertisement -