Wednesday, January 22, 2025

అందుకోసం కెటిఆర్‌కు లేఖ రాసిన రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ప్రజలకు వర్షాలు, వరదల కష్టాలు
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహయ చర్యలు చేపట్టాలి
మంత్రి కెటిఆర్‌కు లేఖ రాసిన టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్:  హైదరాబాద్ ప్రజలకు వర్షాలు, వరదల కష్టాలు అధికమయ్యాయని టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వరదల పరిస్థితి, సహాయక చర్యలపై ఆయన మంత్రి కెటిఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. లేఖలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని, ప్రభావిత ప్రజలకు రూ. 10 వేల సాయం ప్రకటించాలని, వర్షాల కారణంగా బయటకు వెళ్లలేని దినసరి కూలీలను ఆదుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, దెబ్బతిన్న రోడ్లను యుద్ధప్రాతిపదిన మరమత్తులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలమైందని, గల్లీ ఏరైందని, కాలనీ చెరువైందని, రహదారి సాగరమైందన్నారు.

Also Read: భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త….

రోడ్లన్నీ చెరువులుగా మారిపోయాయని, బస్తీలు, కాలనీలు జలమయమయ్యాయని ఆయన ఆరోపించారు. ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో అని ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుంటూ తిరిగాల్సిన పరిస్థితిని కల్పించారని, ఇవన్నీ చూస్తుంటే మీ అసమర్థత కారణంగా హైదరాబాద్ నగరం ఎలా అభివృద్ధి చెందిందో జనాలకు అర్థమైపోయిందని, విశ్వనగరమో విషాద నగరమో తేలిపోయిందన్నారు. ఐటీ కారిడార్ నుంచి హయత్‌నగర్ దాకా ట్రాఫిక్ జాంలు ఎందుకు నిత్యకృత్యంగా మారుతాయని ఆయన ప్రశ్నించారు. ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు నానా యాతన పడుతున్నారని, పది నిమిషాల ప్రయాణానికి రెండు గంటల సమయం పడుతుందని, రహదారుల నిర్వహణ అప్రాధాన్యత అంశంగా మారిందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News