Wednesday, January 22, 2025

రేపు ఢిల్లీకి సిఎం

- Advertisement -
- Advertisement -

మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై
హైకమాండ్‌తో రేవంత్ రెడ్డి చర్చ?
లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులతో కూడిన
జాబితా అందించే అవకాశం

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 19న ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. మంత్రి వర్గ విస్తరణ. నామినేటెడ్ పదవుల పైన హైకమాండ్‌తో చర్చించనున్నారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండటం తో ముందుగా పదవుల పంపిణీ ద్వారా పార్టీలో జోష్ తేవాలని భావిస్తున్నారు. లోక్‌సభ అభ్యర్థుల విషయంలోనూ ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక, మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ దక్కేదెవరనే చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డి పాలనలో పార్టీలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీలో ముఖ్య నిర్ణయాలకు హైకమాండ్ అనుమతితోనే అమలు చేయనున్నారు.

ఈ క్రమంలో భాగంగా మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ సారి ఢిల్లీ పర్యటనలో పూర్తిగా పార్టీపరంగా నియామకాలకు సంబంధించిన చర్చలు ఆమోదం తీసుకోనున్నట్లు సమాచారం. తెలం గాణ మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం ఉంది. వారి కోసమే కొన్ని ప్రధాన శాఖలను పెండింగ్ పెట్టారు. అందులో హోం శాఖతో పాటుగా విద్యా, సాంఘిక సంక్షేమం, మున్సిపల్ వంటి కీల క శాఖలు ఉన్నాయి.ప్రస్తుత కేబినెట్‌లో నిజామాబాద్, అదిలాబా ద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. మిగిలి ఉన్న ఆరు స్థానాలకు 15 మంది పోటీ పడుతున్నారు. ఇందులో ఎంఎల్‌ఎలుగా ఓడిన వారు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News