Sunday, December 22, 2024

ఎయిర్ పోర్టు నుంచి వెనక్కి వెళ్లిన రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు రేవంత్ రెడ్డి హుటాహుటిన డిల్లీ విమానశ్రయం నుంచి వెనక్కి వెళ్లిపోయారు. విమానాశ్రయం నుంచి మహారాష్ట్ర సదన్ కు వెళ్లారు. కాసేపటిక్రితమే ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు వచ్చేందుకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు బయల్దేరారు. రేవంత్ తో పాటు ప్రమాణ స్వీకారం చేసేది ఆరుగురు మంత్రులే?.. ఒక డిప్యూటీ సిఎం, ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో 300 మంది అమరవీరుల కుటుంబాలకు టిపిసిసి ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో ఏఐసిసి చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఏఐసిసి అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News