Monday, December 23, 2024

రేవంత్ రెడ్డి భార్య ఎవరంటే…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇప్పుడు సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి పేరు మారుమోగిపోతోంది. కాబోయే సిఎం రేవంత్ అంటూ ట్వీట్లు, ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. రేవంత్ జీవిత విశేషాలు తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఏవీ కాలేజీలో బిఎ చదివిన రేవంత్ రెడ్డి కొంతకాలం జర్నలిస్టుగా జాగృతి పత్రికలో పనిచేశారు. ఏబీవిపీ నాయకుడిగా విద్యార్ధుల సమస్యల పరిష్కారానికి చురుగ్గా కృషి చేసేవారు. రేవంత్ రెడ్డి భార్య పేరు గీతారెడ్డి. వారికొక కూతురు ఉంది. రేవంత్ ది ప్రేమ వివాహం అనే సంగతి చాలామందికి తెలియదు. గీతారెడ్డి ప్రముఖ కాంగ్రెస్ నేత, దివంగత జైపాల్ రెడ్డికి స్వయానా సోదరుడి కూతురు. చదువుకునే రోజుల్లోనే గీతారెడ్డిని చూసి రేవంత్ మనసు పడ్డారు.

అయితే గీతారెడ్డి తండ్రికి ఇష్టం లేక, తన కూతురిని ఢిల్లీలో ఉన్న జైపాల్ రెడ్డి ఇంటికి పంపించారు. ఇది తెలుసుకున్న రేవంత్ కూడా ఢిల్లీ చేరి, నెమ్మదిగా జైపాల్ తో పరిచయం పెంచుకున్నారు. రేవంత్ పట్ల జైపాల్ రెడ్డికి సదభిప్రాయం కలగడంతో తన సోదరుడికి నచ్చజెప్పి వివాహానికి ఓకే అనిపించారు. ఇరువురి సామాజిక వర్గాలు కూడా ఒకటే కావడంతో రెండు కుటుంబాలవారూ పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. దాంతో 1992లో రేవంత్, గీత ఒకటయ్యారు. వీరి కుమార్తె పేరు నైమిష. 2015లో రేవంత్ కుమార్తెకు సత్యనారాయణరెడ్డితో వివాహమైంది. వీరికి ఒక మగబిడ్డ ఉన్నారు. కుమార్తె వివాహ సమయంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలులో ఉన్నారు. కూతురు వివాహానికి హాజరు కావలసి ఉన్నందున ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రేవంత్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News