Sunday, April 13, 2025

సిఎంగా రేవంత్ రెడ్డే ఉంటారు: శ్రీధర్ బాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో కాంగ్రెస్ ఇంచార్జీ మీనాక్షీ నటరాజన్ సమీక్ష నిర్వహించారని వస్తున్న వార్తలను మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. సచివాలయంలో మీనాక్షీ నటరాజన్ సమీక్ష నిర్వహించలేదని.. తమని కలిసేందుకే ఆమె సెక్రటేరియట్‌కు వచ్చారని శ్రీధర్‌బాబు అన్నారు. సచివాలయానికి ఎవరైనా రావొచ్చని.. బిజెపి, బిఆర్ఎస్ నేతలు కూడా సచివాలయానికి వస్తారని తెలిపారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు చేస్తారని వస్తున్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. తెలంగాణకు రేవంత్‌ రెడ్డే సిఎంగా ఉంటారు.. ఉండితీరుతారని.. అభివృద్ధి, సంక్షేమం చేస్తూ.. రేవంత్ అవినీతిరహిత పాలన చేస్తున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ సమర్థులే అని.. పదవుల కేటాయింపుపై అధిష్టానానిదే అంతిమ నిర్ణయం అని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News