Monday, December 23, 2024

ఎల్‌బినగర్ వస్తే నా గుండె దడ పెరుగుతుంది: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఎల్‌బినగర్‌కు ఎప్పుడు వచ్చినా నాకు తెలియకుండనే నా గుండె దడ పెరుగుతుందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొండగల్ నుంచి ఓడిపోయిన నన్ను 2019లో జరిగిన సార్వత్రి ఎన్నికల్లో ఎల్‌బినగర్ ప్రజలు 30వేల మెజార్టీతో ఎంపిగా గెలిపించారన్నారు. దానితోనే నేను పిసిసి అధ్యక్షుడిన్ని, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాయన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది నా బంధువులు, ఆత్మీయులు ఉన్నారని, ఇదంతా మీ అభిమానమని, మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోను రేవంత్ తెలిపారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, డి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ మల్లేష్, దయానంద్, పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, మల్ రెడ్డి రంగా రెడ్డి , డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ కమిషనర్ రోనాల్ రోస్‌తో పలువురు కార్పొరేటర్లు, జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News