Monday, December 23, 2024

సిఎం కెసిఆర్‌కు రేవంత్ లేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం లేఖ రాశారు. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకో వాలని ఆయన డిమాండ్ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిందని.. రాష్ట్రంలో 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని కానీ వాటిని భర్తీ చేయడం లేదని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు రూ.3106 భృతి ఇస్తానని హామీ ఇచ్చిమోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నోటిఫికేషన్లు, షెడ్యూల్స్‌ని ప్రకటించిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ అసమర్ధత కారణంగా పరీక్షలు రద్దు చేసే పరిస్ధితి ఏర్పడిందని, దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంత జరిగినా నేటి వరకు కమీషన్ ఛైర్మన్, సభ్యులపై ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News