Monday, December 23, 2024

వ్యవసాయంపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బాధాకరం

- Advertisement -
- Advertisement -
  • 24 గంటల విద్యుత్‌తో రైతన్నకు మేలు
  • ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి,డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, వంటిమామిడి మార్కెట్ కమిటీ అధ్యక్షుడు జహాంగిర్

ములుగు: 24 గంటల విద్యుత్ తో నేడు దేశానికే అన్నం పెట్టె స్థాయికి తెలంగాణ రైతులు ఎదిగారని ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి,డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి,వంటిమామిడి మార్కెట్ కమిటీ అధ్యక్షుడు జహాంగిర్‌లు అన్నారు. బుదవారం మ ండల కేంద్రమైన ములుగు రాజీవ్ రహదారిపై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలకు నిరసనగా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నర్సింహ్మా రెడ్డి,రాష్ట్ర యువత విభాగం ఉపాధ్యక్షుడు జుబేరు పాషా, ఎంపిపి ఉపాధ్యక్షుడు దేవేందర్ రెడ్డి,జిల్లా కో అప్షన్ సభ్యుడు సలీం,సీనియర్ నాయకుడు నర్సంపల్లి అర్జున్ గౌడ్,పెద్దబాల్ అంజన్ గౌడ్ ,పిఏసిఎస్ వైస్ చైర్మెన్ నరేష్ గౌడ్,మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు కోడూరి భూపాల్ రెడ్డి బిఆరెస్ శ్రేణులతో కలిసి దర్నా నిర్వహించి,రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఆయన నాయకత్వంలోనే బిఆర్‌ఎస్ రైతు సంక్షేమార్థం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతుభీమా,రైతుబంధు,ఎరువుల పంపిణీ వంటి ఎన్నో పథకాలకు ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. అలాంటిది వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ సరిపోతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించడం దురదృష్టకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్ఫంచులు,ఎంపిటిసిలు, బిఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News