Sunday, January 19, 2025

జోడో.. తోడో

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీ నియర్ల సమావేశంలో వాడీ వేడీగా చర్చ సాగింది. హత్ సే హత్ సే జోడో అభియాన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి తలపెట్టిన పాదయాత్రకు తేడా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మహేశ్వర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. శనివా రం నాడు హైద్రాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్లతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరా ల ఇంచార్జీ మాణిక్ రావు థాక్రే సమావేశమయ్యారు. హత్ సే హత్ జోడో అభియాన్ కార్యక్రమం గురించి చర్చించారు. ఈ చర్చ సమయం లో రేవంత్ రెడ్డి రేపటి నుండి నిర్వహించ తలపెట్టిన పాదయాత్రపై కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర తీరు వేరుగా ఉందన్నారు. ఈ విషయమై మహేశ్వర్ రెడ్డి అభ్యంతరాలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు థాక్రే పట్టించుకోలేదు. ప్రజల్లో ఉండడం తమ కు ముఖ్యమని మాణిక్ రావు థాక్రే చెప్పారు. నే తలంతా ఇళ్లు, పార్టీ కార్యాలయాలు వదిలి ప్రజల్లోకి వెళ్లాలని కోరారు.

ప్రజల్లోకి వెళ్లేందుకు మీ వద్ద ప్రణాళికలను చెప్పాలని థాక్రే కోరినట్టుగా స మాచారం. మరో వైపు డిసిసి అధ్యక్షుల నియామకానికి సంబంధించి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా ఈ సమావేశంలో ప్రస్తావించారు. తాను ఇచ్చిన జాబితాకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని దామోదర రాజనర్సింహ అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 6వ తేదీ నుండి ములుగు జిల్లాలోని మేడారం నుండి పాదయాత్ర చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ పాదయాత్ర కు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనుమతి లేదని గతంలోనే మహేశ్వర్ రెడ్డి ప్రకటించి కలకలం రేపారు. ఇవాళ జరిగిన సీనియర్ల సమావేశంలో కూడా మరోసారి ఇదే తరహ అంశాన్ని మహేశ్వర్ రెడ్డి లేవనెత్తతడం చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు , రేవంత్ రెడ్డికి మధ్య అగాధం చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి పాదయాత్ర ఈ అగాధాన్ని పెంచుతుందా?తగ్గిస్తుందా? అనేది త్వరలోనే తేలనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News