Thursday, December 19, 2024

ప్రగతి భవన్.. ఇకపై ప్రజాభవన్: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సచివాలయం గేట్లు అందరికి తెరుచుకుంటాయని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ప్రగతి భవన్.. డాక్టర్ అంబేద్కర్ భవన్ గా మారుతుందని వెల్లడించారు. ప్రగతి భవన్ కాదు.. ఇకపై అది ప్రజాభవన్ అన్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో బిఆర్ఎస్ సహకరిస్తోందని ఆశిస్తున్నామని అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ స్ఫూర్తి నింపారని చెప్పారు. తాను, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క కలిసి పార్టీని ముందుకు నడిపించామని ఆయన పేర్కొన్నారు. సీనియర్ నాయకులందరి సహకారంతో కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు. మానవ హక్కులను కాపాడటంతో  కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందన్నారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. సిపిఐ, సిపిఎం, టిజెఎస్ లతో కలిసి ముందుకు వెళ్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News