Sunday, December 29, 2024

రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్-బిజెపి మధ్య రాజకీయంగా వార్ నడుస్తోంది. బిజెపి, కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణ లోక్ సభ సీట్లు తమ పార్టీకి ఎక్కువ వస్తాయని ఇరు పార్టీల నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. “తెలంగాణ అడిగింది… పాలమూరు – రంగారెడ్డికి జాతీయ హోదా బిజెపి ఇచ్చింది… “గాడిద గుడ్డు”.  తెలంగాణ అడిగింది… రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బిజెపి ఇచ్చింది… “గాడిద గుడ్డు”. తెలంగాణ అడిగింది… బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ బిజెపి ఇచ్చింది… “గాడిద గుడ్డు”. తెలంగాణ అడిగింది… కృష్ణా, గోదావరిలో వాటాల పంపకం బిజెపి ఇచ్చింది… “గాడిద గుడ్డు”. తెలంగాణ అడిగింది… మేడారం జాతరకు జాతీయహోదా బిజెపి ఇచ్చింది… “గాడిద గుడ్డు”. తెలంగాణ అభివృద్ధికి బిజెపినే అడ్డు… పదేండ్ల మోడీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద “గాడిద గుడ్డు” అని” రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News