Tuesday, January 21, 2025

ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్‌రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొదటి రోజు ఆరు గ్యారంటీలపై క్యాబినేట్ సమావేశం ఏర్పాటు చేసి రెండు గ్యారెంటీల ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. తరువాత సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించేందుకు పథకం అందుబాటులోకి తీసుకొచ్చారు.  గత ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్న ఏడుగురిని శనివారం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు స్పెషల్ ఆఫీసర్లను కూడా ప్రభుత్వం తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వం తొలగించిన సలహాదారులు…

1. సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్
2. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ
3. సాంస్కృతిక, దేవాదాయ సలహాదారు కెవి రమణాచారి
4. అటవీ సంరక్షణ శాఖ ముఖ్య సలహాదారు శోభ
5. హోం శాఖ సలహాదారు అనురాగ్ శర్మ
6. ముస్లిం మైనారిటీ సంక్షేమ సలహాదారు ఏకే ఖాన్
7. చెన్నమనేని రమేష్ ముఖ్య సలహదారు వ్యవసాయ శాఖ
అదే విధంగా ప్రత్యేక అధికార హోదాలు ఉన్నవారికి పదవులు రద్దు
1. ఇరిగేషన్ అడ్వైజర్ ఎస్కే జోషి
2. ఫైనాన్స్ డిపార్టుమెంట్ స్పెషల్ ఆఫీసర్లు జీఆర్‌రెడ్డి, శివశంకర్
3. ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ ఆఫీసర్లు సుధాకర్ తేజ
4. ఇంధన సెక్టార్ స్పెషల్ ఆఫీసర్లు రాజేంద్ర ప్రసాద్ సింగ్
7. ఉద్యాన శాఖ అడ్వైజర్ శ్రీనివాస్‌రావు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News