టేకులపల్లి : తెలంగాణలో రైతాంగానికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కరెంటును మూడుగంటలు మాత్రమే అందించాలని పిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి చేసిన వాఖ్యలను నిరసిస్తూ బిఆర్‌యస్ పార్టి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. స్థానిక బోడు సెంటర్‌లోని ప్రధాన కూడలి వద్ద రోడ్డుపై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఇల్లెందు ఏయంసిచైర్మన్ బానోత్‌హరిసింగ్ నాయక్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పాలనలో పురుగుల మందు తాగి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ పరిస్థితి నుంచి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో అనేక రైతు సంక్షేమ పథకాలతో రైతులు సుభిక్షంగా వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. దేశంలోని ఏరాష్ట్రంలో కూడా లేనటువంటి సంక్షేమ పథకాలు రైతుబందు, ఉచితకరెంటు, రైతుబీమా లాంటివి రేవంత్‌రెడికి కనిపించడంలేదా అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టి అధికారంలోకి రాకముందే రైతు వ్యతిరేక విధానాలను రేవంత్ రెడ్డి ప్రకటించారని ఉచిత కరెంటును కేవలం మూడు గంటలపాటు మాత్రమే అందించాలనడం రైతు వ్యతిరేక వాఖ్యలు పరిగణించాలన్నారు.
తక్షణమే రైతు వ్యతిరేకి రేవంత్‌రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు తెలపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టి పాలనలోని ఏ రాష్ట్రంలో కూడ రైతులకు ఉచిత విద్యుత్ అందంచిడంలేదన్నారు. దేశం కాని దేశంలో తెలంగాణ రైతులకు వ్యతిరేకంగా వాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టి హయాంలో పురుగన్నం తిని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే నేడు తెలంగాణలో బిఆర్‌యస్ పాలనలో రైతులు పెరుగన్నం తింటున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేకుండా చేయాలని లేదంటే రైతు వ్యతిరేక విధానాలతో రైతులను మోసం చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టి అధ్యక్ష కార్యదర్శులు వరప్రసాద్, బోడ బాలునాయక్, బానోత్ రామానాయక్, బానోత్ కిషన్‌నాయక్, యంపిటిసి బాలకృష్ణ, రైతు సమితి నాయకులు లక్కినేనిశ్యామ్, బసవయ్య, శివ, కిరణ్, రవినాయక్, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.