Monday, December 23, 2024

ఓటుకు నోటు కేసులో రేవంత్‌కు చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

మన తెలంగాణ/హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో పిసిసి అ ధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని రేవంత్ రె డ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఇరు వర్గాల వాదనలు వినింది. ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని, అన్నీ విషయాలు ట్ర యల్ కోర్టుకు ఇచ్చామని తెలంగాణ ప్రభుత్వం తరపు లాయర్లు వాదించారు. ఈ కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాద ని, కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు వాదించారు. ఇరు వర్గాల వాదనల అనంతరం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ మంగళవారం తీర్పు వెల్లడించింది. గతంలో ఓటుకు నోటు కేసుకు సంబంధిం చి హైకోర్టును రేవంత్ ఆశ్రయించారు. అసలు ఈ కేసు ఎసిబి పరిధిలోకి రాదంటూ పిటిషన్‌లో పేర్కొ న్నారు. అయితే రేవంత్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును రేవంత్ రెడ్డి ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ ఎన్వీఎన్ భట్టి, సంజీవ్ ఖన్నాతో కూ డిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదోపవాదనలు అనం తరం పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఈ కేసులో రేవంత్ తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారిం ది. తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికీ విదితమే. ఏకంగా అప్పటి ఎపి సిఎంగా ఉన్న చంద్రబాబు ఈ కేసులో చిక్కుకోవడంతో తెలుగునాట కలకలం రేపింది. రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంఎల్‌సి స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్ కాల్ మాట్లాడిన ఆడియో ప్రకంపనలు సృష్టించింది. ఎంఎల్‌సి ఎన్నికల్లో టిడిపి గెలుపొందేందుకు స్టీఫెన్‌సన్ కు డబ్బులు ఆఫర్ చేయగా ఆయన ఇంట్లో రేవంత్ రెడ్డి డబ్బుల బ్యాగ్‌తో అడ్డంగా ఎసిబికి బుక్ అయ్యారు.

ఈ కేసులో రేవంత్ రెడ్డి కొద్ది నెలల పాటు జైల్లో ఉండి, ఆ తర్వాత బెయిల్‌పై బయటకొచ్చా రు. ఈ కేసులో చంద్రబాబును కూడా ముద్దాయి గా చే ర్చాలని మంగళగిరి వైసిపి ఎంఎల్‌ఎ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎప్పటినుంచో న్యాయపోరాటం చేస్తున్నారు. 2017లో ఓటుకు నోటు కేసుకు సంబంధించి సుప్రీంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు పిటిషన్లు వేశారు. ఈ కేసులో చంద్రబాబును కూడా ముద్దాయిగా చేర్చాలని కోరుతూ ఒక పిటిషన్ వేయగా, సిబిఐ దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వాలని మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై అక్టోబర్ 4న విచారణ జరగనుంది. ఐటెం నెంబర్ 42గా లిస్ట్ అవ్వగా జస్టిస్ సంజయ్ కుమార్, ఎంఎం సుందరేశ్ ధర్మాసనం దీనిపై విచారణ నిర్వహించనుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాం గ్రెస్‌ను గెలిపించేందుకు రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు. అలా గే గత ఎన్నికల్లో ఎపిలో టిడిపి ఓటమి పాలవ్వగా ఈ సారి ఎలాగైనా గెలుపొందేందుకు చంద్రబాబు ఇప్పటినుంచే వ్యూహ లు రచిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి రావడం కీలకకాంశంగా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News