Sunday, December 22, 2024

బహిష్కరణ

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను తాము బహిష్కరిస్తున్నామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు ప్రకటించారు. ప్రధాని పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాము హాజరుకావడం లేద ని స్పష్టం చేశారు. తెలంగాణ పుట్టుకనే అవమానించిన వ్యక్తి మోడీ అని విమర్శించారు. తల్లిని చంపి బిడ్డను వేరు చేశార న్న నరేంద్ర మోడీని తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. 2014లో ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి ప్రధాని మోడీ తెలంగాణపై వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకున్నారని మండిపడ్డారు. మోడీకి తెలంగాణ పట్ల ఇంత వ్యతిరేకత ఎందుకో తెలియదని పేర్కొన్నారు. విభజన హామీలను ప్ర ధాని మోడీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారని నిలదీశారు.

తెలంగాణ భవన్‌లో మంత్రులు జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంఎల్‌ఎ లు, ఎంఎల్‌సిలు, పార్టీ నాయకులతో కలిసి మంత్రి కెటిఆర్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో ఉన్నా వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామనడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. గుజరాత్‌లోని దహోడ్‌లో రూ.20వేల కోట్లతోలోకోమోటివ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారని, తెలంగాణకు కేవలం రూ.521 కోట్ల నిధులు ఇవ్వడం ఏం టని అడిగారు. తెలంగాణ పట్ల ప్రధాని మొసలి కన్నీరు కా రుస్తున్నారని విమర్శించారు. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీ ఏమైందని నిలదీశారు. మ తం పేరిట ప్రజల మధ్య చిచ్చుపెట్టిన ప్రధానమంత్రిని తెలంగాణ ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. ప్రధాని మోదీ పాలనలో ఏదైనా పెరిగిందంటే నిరుద్యోగం, అప్పులు మా త్రమేనని విమర్శించారు.

ధరణిపై హాస్యాస్పదంగా రేవంత్ మాటలు
ధరణి పోర్టల్ విషయంలో రేవంత్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి కెటిఆర్ విమర్శించారు. రూ.వేల కోట్లు అంటూ రేవంత్ ఇష్టారీతిన మాట్లాడతారని మండిపడ్డారు. ధరణిపై రేవంత్ ఆరోపణలను కెటిఆర్ తిప్పికొట్టారు. భూదందాలు, కబ్జాలు చేసేవాళ్లకు ధరణి నచ్చట్లేదని అన్నారు. ధరణి ఎంత సఫలం అయిందనేది ప్రజలకు తాము వివరిస్తామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News