Monday, December 23, 2024

రేవంత్ రాజకీయ ఎదుగుదల ఇలా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అనుముల రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం కొండారెడ్డిపల్లిలో జన్మించారు. తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, రాంచంద్రమ్మ. డిగ్రీ టైమ్ లోనే విద్యార్థి నాయకుడిగా రేవంత్ ఎదిగారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారిగా రేవంత్‌రెడ్డి 2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం సాధించారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానికసంస్థల స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.

తెలుగుదేశం పార్టీ నుండి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ పోటీచేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు రావులపల్లి గుర్నాథరెడ్డిపై ఆయన విజయం సాధించాడు. ఆయన 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. 2014–17 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేశారు. 2017 అక్టోబరులో టిడిపికి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. రేవంత్‌రెడ్డి 2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యాడు.

2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. రేవంత్‌ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్ష్యుడిగా 2021 జూన్ 26లో జాతీయ కాంగ్రెస్ పార్టీ నియమించింది. రేవంత్ 2021 జూలై 7న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ సమక్షంలో టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News