Monday, December 23, 2024

రేవంత్ వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుండి తొలగించాలి

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల

మన తెలంగాణ /హైదరాబాద్ : అసెంబ్లీ సాక్షిగా సిఎం రేవంత్ రెడ్డి ఎన్నారై అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ అని అన్నారని ఈ వాక్యాలను పూర్తిగా ఖండిస్తున్నానని బిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. ఈ సందర్భంగా మహేశ్ బిగాల మాట్లాడుతూ ఎన్నారైలు అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అని సిఎంని సరిచేసుకోవాలని కోరారు. సిఎం వ్యాఖ్యలు గౌరవ సభలో అందరి మర్యాదలు కాపాడేటట్టు ఉండాలని, ప్రపంచ వ్యాప్తంగా వున్న ఎన్నారైలు ఇండియన్ ఎకానమీకి ఎన్నో రకాలుగా వారు తమ కుటుంబాలకు డబ్బును తిరిగి పంపడం ద్వారా భారతదేశానికి సహాయం చేస్తారన్నారు.

ఇది భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని ఈ డబ్బు విదేశీ కరెన్సీని పెంచుతుందని, ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండేలా చేస్తుందని గుర్తు చేశారు. ఎన్నారైల పక్షాన మేము కోరేది ముఖ్యమంత్రి తన మాటలను అసెంబ్లీ రికార్డ్ నుంచి తొలగించలని కోరారు. ఎన్నారైలు అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అని సరిదిద్దుకోవాలని సూచిస్తున్నామన్నారు. గౌరవ సభలో అందరి మర్యాదలు కాపాడేటట్టు ఉండాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఆర్‌ఐలు భారత ఆర్థిక వ్యవస్థ కు చేదోడు వాదోడుగా ఉంటున్నారని గుర్తు చేశారు. విదేశి డబ్బును తమతమ కుటుంబాలకు పంపడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని పేర్కొన్నారు. సిఎం వ్యాఖ్యలను అసెంబ్లీ రికారడ్స్ నుంచి తొలగించాలని ఎన్‌ఆర్‌ఐల పక్షాన కోరుతున్నామని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News