Monday, December 23, 2024

రేవంత్ మూలాలు ఆర్‌ఎస్‌ఎస్ నుండి వచ్చాయి

- Advertisement -
- Advertisement -

ముస్లింలకు వ్యతిరేకంగా రేవంత్ మాటలు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఆగ్రహం

మన తెలంగాణ / హైదరాబాద్ : ఒవైసి కుటుంబం మహారాష్ట్ర నుంచి వచ్చిందంటూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసి ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ భాష మాట్లాడుతున్నారని ఒవైసీ అన్నారు. ఎప్పుడూ ముస్లింలు, ఇస్లాం బయటి నుంచి వచ్చారని చెప్పే ఆర్‌ఎస్‌ఎస్ నేతల్లాగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మాట్లాడుతున్నారని అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము మహారాష్ట్ర నుండి రాలేదు. మేము ఆదమ్ బిడ్డలం, మొత్తం భారతదేశం మాది, నీవు ఎక్కడి నుంచి వచ్చావని ఆయన రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ముస్లింలపై ద్వేషాన్ని చిమ్ముతున్నారని విమర్శించారు. ఎబివిసిలో పనిచేసిన రేవంత్ రెడ్డి అక్కడి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌లోకి ఆ తర్వాత బిజెపిలోకి వెళ్లారని ఒవైసీ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ సూచన మేరకే తను టిడిపిలో చేరానని చెప్పాడని పేర్కొన్నారు. 1999 లో కార్వాన్ నియోజకవర్గంలో ఎంఐఎంకు వ్యతిరేకంగా బిజెపి కిషన్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి పనిచేశారని ఆరోపించారు.

ఆర్‌ఎస్‌ఎస్ భాష మాట్లాడే రేవంత్‌రెడ్డి వంటి నేతలను కాంగ్రెస్ పార్టీ తన గుప్పిట్లోకి తీసుకుంటోందని మండిపడ్డారు. తెలంగాణ ముస్లింలు కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దని ఓవైసి అన్నారు. రాజ్స్థాన్‌లో జునైద్‌ను సజీవంగా కాల్చి చంపారని అతని కుటుంబాన్ని ఇంత వరకు ఆదుకోలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మూడోసారి అధికారంలోకి రానున్నారని ఓవైసి స్పష్టం చేశారు. దేశ రాజకీయాలలో ముస్లింల ప్రాతినిధ్యం లేకపోవడానికి నెహ్రూ, పటేల్ కారణమని ఓవైసి ఆరోపించారు. ప్రధాని విద్వేశాలను పెంచుతున్నారని, 2014 నుంచి ఇది మరింత ఎక్కువైందని ఆయన చెప్పారు. బిజెపిలో ఒక్క ముస్లిం ఎంఎల్‌ఎ , ముస్లిం ఎంపి, ముస్లిం మంత్రి లేరన్నారు, మౌనంగా ఉండడానికి తాము రాలేదని, తాము పోరాడేందుకు వచ్చామని ఓవైసి చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News