Thursday, September 19, 2024

జన్వాడలో సర్వే

- Advertisement -
- Advertisement -

ఫాంహౌస్‌ను పరిశీలించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు
బుల్కాపూర్ నాలా ఆక్రమణలపై పెద్దయెత్తున ఫిర్యాదులు
రావడంతో పరిశీలన ఫాంహౌస్ ముందు నాలా ఆక్రమణకు గురైనట్లు గుర్తింపు?
కూల్చివేస్తారని పెద్ద ఎత్తున ఊహాగానాలు

మనతెలంగాణ/శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలం, జన్వాడలో మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆ ర్ మిత్రుడు ప్రదీప్ రెడ్డికి చెందిన ఫాంహౌస్ లో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు మంగళ వారం సర్వే నిర్వహించారు. ఉన్నతాధికారు ల ఆదేశాలతో రెవెన్యూ ఇన్స్‌స్పెక్టర్ తేజ, స ర్వేయర్ సాయి, నీటిపారుదల శాఖ అధికారి లింగం జన్వాడ ఫాంహౌస్‌ను పరిశీలించారు. బుల్కాపూర్ నాలా ఆక్రమణలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో మోకిల, జన్వాడ శి వారులలో బుల్కాపూర్ నాలాను సర్వే చేశా రు. నాలా ఏ ఏ సర్వే నెంబర్ల పరిధిలో ఆక్రమణలకు గురైందో సర్వే నెంబర్ల వారీగా పరిశీలించారు.

కెటిఆర్ మిత్రుడికి చెందిన ఫాంహౌస్ ముందు నుంచి నాలా ప్రవహించడం, అక్కడ ఆక్రమణలకు గురైన విషయాన్ని గుర్తించినట్లు తెలిసింది. ఆర్‌ఐ తేజ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుల్కాపూర్ నాలాను పరిశీలించామని, నివేదికను వారికి అందజేస్తామని అన్నారు. జన్వాడ ఫాంహౌస్‌లో సర్వే జరుగుతున్నట్లు మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో పెద్ద సంఖ్యలో జనంతో పాటు మీడియా అక్కడకు తరలివచ్చింది. జి.ఓ 111 నిబంధనలకు విరుద్ధంగా ఫాంహౌస్ నిర్మించడంతో పాటు ఫాంహౌస్ గేటు ముందు బుల్కాపూర్ నాలా కుంచించుకుపోవడం కూల్చివేస్తారని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News