Sunday, December 22, 2024

మర్రి కాలేజీలపై హైడ్రా నజర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: చెరువులో అక్రమంగా నిర్మించిన మర్రి రాజశేఖర్‌రెడ్డి కాలేజీ భవనాలకు రెవెన్యూ అధికారులు నోటీసు ఇచ్చి పంజా విసిరారు. దుండిగల్ మున్సిపాలిటీలోని దుం డిగల్ చిన్నదామర చెరువుపై హైడ్రా నజర్ పెట్టిం ది. ఇందులో భాగంగా మేడ్చెల్ కలెక్టర్ ఆదేశాల తో మల్కాజిగిరి ఎమ్యెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఎంఎల్‌ఆర్‌ఐటి, ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలు చిన్నదామర చెరువులో నిర్మించిన అక్రమ నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు తాజా గా నోటీసులు జారీ చేశారు. దుండిగల్ చిన్నదామర చెరువు లేక్ ఐడి 2811, సర్వే నంబర్ 405, 485, 486, 488, 492, విస్తీర్ణం 123.5 ఎకరా లు ఉండగా సుమారు 8 ఎకరాల చెరువును ఆక్రమించి మర్రి రాజశేఖర్ రెడ్డి అక్రమ నిర్మాణాలు చేపట్టారని 2007లో హైకోర్టులో కేసు నమోదు కావడంతో విచారించిన న్యాయస్థానం

అక్రమ నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించడంతో డిప్యూటీ సోలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా ప్రవీణ్‌కుమార్ ఆదేశాలతో గవర్నమెం ట్ ప్లీడర్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఫిబ్రవరి నెల లో చెరువును సందర్శించి అక్రమ నిర్మాణాలను గుర్తించి అధికారులకు నివేదిక పంపారు. నివేదిక ఆధారంగా ఫిబ్రవరి 20వ తేదీన మేడ్చల్ జి ల్లా లెక్టర్ గౌతమ్‌కుమార్ పరిశీలించి అక్రమ ని ర్మాణాల కూల్చివేతలకు ఆదేశాలు జారీ చేయడం తో చెరువులో నిర్మించిన షెడ్లు, పార్కింగ్, ప్లే గ్రౌం డ్, శాశ్వత కట్టడాలను కూల్చివేయడంతో అప్ప ట్లో పెద్ద దుమారమే రేపింది. హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో కూల్చేవేతలకు బ్రేక్ పడిం ది.హైకోర్టు ఉతర్వుల గడువు ముగియడంతో రెవె న్యూ అధికారులుసమాధానం ఇవ్వాలంటూ శుక్రవారం నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

హైడ్రా దూకుడు… మర్రి కాలేజీలో అలజడి
చెరువులలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో దూకుడు మీద ఉన్న హైడ్రా చిన్న దామర చెరువును ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించింది. ఇప్పటికే ఆ ఫైల్‌ను తెప్పించుకున్న హైడ్రా త్వరలో చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. కలెక్టర్ ఆదేశాలతో దుండిగల్ ఎంఆర్‌ఓ సయ్యద్ అబ్దుల్ మతిన్ నోటీసులు జారీ చేశారు. హైడ్రా దూకుడు కొనసాగేనా? కూల్చివేతలు జరిగేనా? లేక కోర్టు నోటీసులతో కళాశాల యాజమాన్యం మరోమారు అడ్డుపుల్ల వేస్తుందా వేచిచూడాల్సిందే.
కళాశాల వద్ద ఆంక్షలు…. బౌన్సర్లతో బందోబస్తు
చెరువులో అక్రమ నిర్మాణాలకు ఎంఎల్‌ఆర్‌ఐటి కళాశాలకు నోటీసులు రెవెన్యూ అధికారులు జారీ చేశారని తెలియగానే కళాశాల యాజమాన్యం అలర్ట్ అయ్యారు. కళాశాల గేటు వద్ద ఆంక్షలు విధిస్తూ బౌన్సర్లను ఏర్పాటు చేసి విద్యార్థులను తప్ప కళాశాలలోకి ఎవరిని అనుమతించేది లేదంటూ బారీ కేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరు వచ్చినా ప్రిన్సిపాల్ లేరు తర్వాత రండంటూ వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. అయితే కూల్చివేతలు జరుగుతాయా లేక ఏం జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News