Wednesday, January 22, 2025

రెవెన్యూ ఉద్యోగి ఉపేందర్ రావుకు ఉద్యోగుల జేఏసి అండ

- Advertisement -
- Advertisement -

రెవెన్యూ ఉద్యోగుల జేఏసి చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో రూ. 5లక్షల చెక్కు అందజేత

మనతెలంగాణ/హైదరాబాద్:  రెవెన్యూ ఉద్యోగి ఉపేందర్ రావుకు రెవెన్యూ ఉద్యోగుల జేఏసి అండగా నిలిచింది. రెవెన్యూ ఉద్యోగుల జేఏసి చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు ఉపేందర్ రావుకు శనివారకం రూ.5 లక్షల చెక్కును అందచేశారు. గరికె ఉపేందర్ రావు కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి ఖర్చులు, ఇతర అవసరాల నిమిత్తం రెవెన్యూ ఉద్యోగుల జేఏసి చైర్మన్ వి.లచ్చిరెడ్డి రూ.5 లక్షల చెక్కును ఉపేందర్ రావుకు అందజేశారు. ఉపేందర్ రావు తరహాలో తరహాలోనే రాష్ట్రంలో ఎంతోమంది రెవెన్యూ ఉద్యోగులకు కావాల్సిన సహాయ సహకారాలను అందజేసినట్టుగా ఈ సందర్భంగా లచ్చిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్. రాములు, రమేష్ పాక, సెక్రటరీ జనరల్ ఫుల్ సింగ్ చౌహన్, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News