మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు వాణిజ్య పన్నుల శాఖ వెన్నుదన్నుగా నిలుస్తోంది. రాష్ట్ర రాబడుల్లో సింహభాగం ఈ శాఖ నుంచే సమకూరుతోంది. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా పెట్రోలు, డీజిల్, మద్యం అమ్మకం పన్ను, జీఎస్టీ రాబడు ల ద్వారా అంతకంతకు వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం పెరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం సు మారు రూ.65వేల కోట్ల ఆదాయం వస్తుందని ఆ శాఖ అధికారులు అంచనా వేయగా ఇప్పటికే వారి అం చనాలను తలకిందులు చేస్తూ సుమారుగా రూ.70 వేల కోట్ల ఆదాయం ఆ శాఖకు వచ్చింది. రాష్ట్ర రాబడుల్లో దీని ద్వారా 60 శా తం పైగా వస్తోంది. ప్రస్తుత ఆ ర్థిక సంవత్సరంలో ఈ శాఖ ఆ దాయం ఇప్పటికే రూ.70 వేల కోట్లకు చేరుకోగా ఈనెలాఖరులోగా మరో రూ.2 వేల కో ట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో జీఎస్టీ పరిహారం నామమాత్రంగా వచ్చినా జీ ఎస్టీ రాబడి మాత్రం పెరిగింది. వాణిజ్యపన్నులశాఖకు సగటున ప్రతి నెలా 7వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరుతోంది.
దీంతోపాటు పెట్రోలు, డీజిల్ అమ్మకాలు రాష్ట్రంలో భారీ గా పెరిగాయి. ఈ ఏడాదిలోనే అత్యధికంగా జనవరి నెలలో రూ.1402 కోట్లు పెట్రోలియం ఉత్పత్తులపై అమ్మకపు పన్నురూపంలో రాగా, మద్యం అమ్మకంపన్ను, ఎక్సైజ్ డ్యూటీ రూపంలో రూ. 31.077 కోట్లు, మద్యం అమ్మకం పన్ను ద్వారా రూ.14,905 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూపంలో రూ.16,596 కోట్ల ఆదాయం ఆ శాఖకు సమకూరడం గమనార్హం. వాణిజ్యపన్నుల శాఖ రూ.70 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించినందుకు వాణిజ్య పన్నుల శాఖ సిబ్బందికి ఆర్ధిక మంత్రి హరీష్‌రావు అభినందనలు తెలిపారు. కమిషనర్ నీతూప్రసాద్ కుమారి ఆమె బృందం చేసిన కృషి అభినందనీయమని ట్విట్టర్ వేదికగా మంత్రి ప్రశంసించారు. వాణిజ్య పన్నుల అధికారులు రూపొందించిన ఆవిష్కరణలను అమలు చేయడంలో కీలకమైన సిస్టమ్ ఆధారిత మాడ్యూళ్లను అందించినందుకు ఐటి టీమ్ కోఆర్డినేటర్ డాక్టర్ శోభన్‌బాబును హరీష్‌రావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ నెలాఖరు నాటికి ఆ శాఖ రూ.72 వేల కోట్ల లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.