Saturday, November 16, 2024

సుంకంపై శుద్ధ అబద్ధాలు

- Advertisement -
- Advertisement -

ఎక్సైజ్ పన్నుల రాబడిలో రాష్ట్రాలకు దక్కేది 5%లోపే..

కేంద్రం పన్నుల్లో తెలంగాణకు వచ్చేది రూ.21,470 కోట్లు

పెట్రోల్, డీజిల్ అసలు ధరల కన్నా కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకానిదే సింహభాగం

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోలు, డీజిలు ధరలు సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా ఈ రెండు ఇంధనాల ధరలు పెరగడమే తప్ప తగ్గిన సందర్భాలు చాలా అరుదు. ఒక వేళ తగ్గినా పైసల లెక్కల్లో మాత్రమే తగ్గుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలను బట్టి పెట్రో లు, డీజిలు ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయిస్తుంటాయి. అయితే వాస్తవానికి పెట్రోలు, డీజిలు అసలు ధరలకన్నా కేంద్రం విధించే పన్నులే ఎక్కువగా ఉంటాయి.అందులో ఎక్సైజ్ పన్నుదే సింహభాగం. అందువల్లనే వీటి ధరలు సామాన్యుడు భరించలేని స్థాయిలో ఉంటున్నాయి. పెట్రోలు, డీజిలుపై కేంద్రం విధించే ఎక్సైజ్ పన్నుల్లో సగం వాటా రాష్ట్రాలకే వెళుతుందని, అందువల్లనే రాష్ట్రాలు వీటి ధరలు తగ్గించడానికి ఇష్టపడడం లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నా యి.

అందుకే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రోలు, డీజిలు ధరలు మా త్రం తగ్గడం లేదనే ప్రచారం ఉంది. అయి తే ఇది పూ ర్తిగా తప్పుడు ప్రచారం అని కేంద్ర ప్రభుత గణాంకాలే చెబుతున్నాయి. వాస్తవానికి కేంద్ర ఎక్సైజ్ పన్నుల్లో రాష్ట్రాలకు దక్కే వాటా నామమాత్రమే. ఉదాహరణకు ఈ ఏడాది బడ్జెట్‌లో దాదాపు రెండున్నర లక్షల కోట్లు ఎక్సైజ్ సుంకాల ద్వారా కేంద్రానికి ఆదాయం సమకూరితే అందులో రాష్ట్రాలకు దక్కేది రూ.13,571 కోట్లు మాత్రమేనని కేంద్రప్రభుత్వమే తన బడ్జెట్‌లో పే ర్కొంది. అంటే కేంద్ర ఎక్సైజ్ పన్నుల ఆదాయంలో రా ష్ట్రాలకు దక్కేది 5 శాతంకన్నా తక్కువేనని కేంద్రప్రభు త్వ లెక్కలే చెబుతున్నాయి. మిగతా మొత్తం అంతా కేంద్రప్రభుత్వ బొక్కసానికే వెళ్తోంది. ఇంత భారీ మొ త్తంలో ఆదాయం ప్రభుత్వానికి మిగతా దేని మీద కూడా రాదు. అందుకే ఈ ఆదాయాన్ని వదులుకోవడం ఇష్టం లేకనే కేంద్రం పెట్రోలు, డీజిలుపై ఎక్సైజ్ సుం కాలను తగ్గించడానికి ఇష్టపడడం లేదు. ఎప్పుడైనా జనంతో పా టు ప్రతిపక్షాలు పెట్రోలు, డీజిలు ధరలపై గగ్గోలు పెట్టినప్పుడు రాష్ట్రాలు తమ ఆదాయం అంటే జిఎస్‌టి తదితర స్థానిక సుంకాలద్వారా వచ్చే ఆదాయాన్ని కొంతమేర తగ్గించుకొని పెట్రో మం టల నుంచి సామాన్యుడికి ఊరట కలిగించాలని ఉచిత సలహా ఇస్తూ ఉంటుంది.

నిజానికి ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఏడాది క్రితంతో పోలిస్తే భారీగా తగ్గాయి. అంతేకాకుండా రష్యాఉక్రెయిన్ ఘర్షణ తర్వాత యూరప్ దే శాలు రష్యానుంచి చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధించడంతో రష్యా మన దేశానికి మార్కెట్ ధరకన్నా చాలా తక్కువ ధరకే ముడి చమురును సరఫరా చేస్తోంది. గత ఏడదిగా మన దేశం దిగుమతి చేసుకునే ముడి చమురులో 35 శాతం రష్యానుంచే దిగుమతి చేసుకుంది. అంటే ఈ లెక్కన కేంద్రానికి కొన్ని వేల కోట్లు రూపాయలు చమురుపై వెచ్చించే మొత్తంలో ఆదా అయింది. అయినప్పటికీ కేంద్రం పెట్రోలు, డీజిలు ధరలను తగ్గించలేదు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా అని గత రెండు నెలులగా వీటి ధరలు పెరగలేదు. అదే పది వేలని సామాన్యుడు భావించాలేమో. పెట్రోలు, డీజిలును జిఎస్‌టి పరిధిలోకి తీసుకు రావాలనే డిమాండ్ అప్పుడప్పుడూ వినిపిస్తూనే ఉన్నప్పటికీ రాష్ట్రాలన్నీ అంగీకరిస్తే తమకేమీ అభ్యంతరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నెపాన్ని రాష్ట్రాలపైకి నెట్టేస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు తప్ప పెట్రోలు, డీజిలు ధరలు తగ్గితే ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందనే మౌలిక సూత్రాన్ని మరిచిపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News