Thursday, January 9, 2025

ఎసిబి వలలో రెవెన్యూ అధికారి

- Advertisement -
- Advertisement -

ఆత్మకూర్ : ఆత్మకూ ర్ తహసిల్దార్ కార్యాలయంలో ఆర్ ఐగా విధులు నిర్వహిస్తున్న నరిసింహులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సంఘటన ఆత్మకూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎసిబి డిఎ స్సి శ్రీకృష్ణ గౌడ్ తెలిపిన వివారల ప్ర కారం మోట్లంపల్లి గ్రామంలో 217,1 8,20,21 సర్వే నంబర్లు 2 ఎకరాల 26 గుంటల భూమి యజమాని గట్టన్న 9 స ంవత్సరాల క్రితం మరణించడంతో ఆయన వారసునైన నాగ ప్ప, మాబమ్మ, ఆంజనేయులు పేర్ల పై విరాసత్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు.

ఆగస్టు 4న ఆర్‌ఐ నర్సింహులు మోట్ల ంపల్లి గ్రామంలో విచారణ చేసి సర్వే రిపోర్ట్ సిద్ధం చేసి పదివేల రూపాయలు లంచంగా ఇస్తే రిపోర్టును కార్యాలయంలో సమర్పిస్తామని ఆర్‌ఐ పరసింహులు బాధిత కుటుంబ సభ్యులైన జానకిరాములకు చెప్పారు. లంచం ఇవ్వడానికి ఒప్పుకు న్న జానకి రాములు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా శుక్రవారం జానకి రాము లు డబ్బులను తహసిల్దార కార్యాయల ంలో ఆర్‌ఐ నరసింహులు తీసుకుంటు ండగా రెడ్ హ్యండ్ గా పట్టుకుంవడం జరిగిందని ఆమన తెలిపారు.

అనంతరం ఎసిబి డియస్‌పి బి. కృష్ణ మాట్లాడుతూ లంచం ఇవ్వడం,తీసుకోవడం నేరమని ప్ర భుత్వ కార్యాలయంలో ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. ల ంచం తీసుకుంట్టు కట్టుబడిన ఆర్‌ఐ నరసింహులు ఏసీబీ నా ంపల్లి కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. దాడుల్లో సిఐ జిలాని, లింగ స్వామి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News