Saturday, December 21, 2024

ఏసీబికి చిక్కిన అవినితి చేప

- Advertisement -
- Advertisement -

ఏసీబికి చిక్కిన అవినితి చేప
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రెవెన్యూ ఉద్యోగి
డెత్ సర్టిఫికేట్‌కు లంచం అడగడంతో ఫిర్యాదు
మనతెలంగాణ/ఇల్లంతకుంట: మరణ దృవికరణ పత్రం ఇచ్చేందుకు రూ. 1000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా పట్టుబడ్డాడు రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో రెవెన్యూ ఉద్యోగి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఏస్పీ భద్రయ్య వెల్లడించిన వివరాల ప్రకారం. మండలంలోని తాళ్లపెల్లి గ్రామానికి చెందిన బోంగోని అంజయ్య, తన తండ్రి చంద్రయ్య 2005 సంవత్సరంలో మృతి చెందాడు. అయితే, తండ్రి డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలని రెవెన్యూ కార్యాలయంలో అక్టోబర్ 29న దరఖాస్తూ చేసుకున్నాడు. జూనియర్ అసిస్టేంట్ మహేశ్వరపు వెంకట రాజా కిషన్ ను కలిశాడు. సదరు ఉద్యోగి రూ. 5వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో భాదితుడు ససేమిరా అన్నాడు.

చివరకు రూ. వేయ్యి ఇచ్చేందుకు ఈనెల 16న నిర్ణయించుకుని, ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారుల సహాయంతో బుధవారం తహసీల్దార్ కార్యాయంలో పక్క ప్లాన్ ప్రకారం రూ.1000 లచం భాధితుడి నుండి తీసుకుంటున్న జూనియర్ అసిస్టేంట్ ను పట్టుకున్నారు. లంచం తీసుకున్న అధికారి పై కేసునమోదు చేసినట్లు డీఏస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్స్‌పెక్టర్లు రాము, తిరుపతి, రవీందర్ లు ఉన్నారు. మండలంలో ఏసీబీ దాడులు జరగడంతో ఒక్క సారిగా ఉద్యోగుల్లో వణుకు మొదలైంది. కొన్ని రోజుల క్రితమే తహసీల్దార్ కార్యాయలంలో సర్వేయర్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సంఘటన మరవకముందే మరోకరు పట్టుబడడం చర్చనీయంగా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News