Monday, December 23, 2024

ట్విన్ టవర్స్‌కు స్థలాల పరిశీలన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఓడిల కోసం నిర్మించే ట్విన్ టవర్స్ కోసం స్థలాలను రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. అధికారుల పరిశీలనలో మూడు ప్రదేశాలు ఉండగా.. వాటిలో పాటిగడ్డలోని ప్రభుత్వ స్థలంలో గానీ, ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్, రిట్జ్ హోటల్, లోకాయుక్తల స్థలం కలిపి ఒకే సైట్ గా హెచ్‌ఓడిల నిర్మాణం, రెడ్ హిల్స్ లో మరొక సైట్ లో నిర్మించేందుకు ప్రతిపాదించనున్నారు.

ఈ మేరకు స్థలాలను పరిశీలన పూర్తి చేసి శంకుస్థాపన కోసం అధికారులు ఫైల్ సిద్దం చేస్తున్నారు. పాటిగడ్డలో నిర్మిస్తే నెక్లెస్ రోడ్డుకు అనుసంధానం చేసే విధంగా 400 మీటర్ల మేరకు ఫ్లై ఓవర్ నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News