ఈ సందర్భంగా వేముల మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ అధికార యంత్రంగం అద్భుతంగా పని చేస్తుందని కొనియాడారు. గత సమావేశాలను అధికారులు, శాసన సభ ,శాసన మండలి సభ్యులు సహకారంతో సజావుగా నడుపుకున్నామని, ఈ నెల 24 తేదీ నుండి జరిగే సమావేశాలను ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా విజయవంతంగా నడుపుకుంటామన్నారు. గతంలో మాదిరిగానే ప్రతి డిపార్ట్మెంట్ నుండి నోడల్ అధికారులను నియమించాలని, నోడల్ అధికారులతో తెలంగాణ లేజిస్లేటివ్ సెక్రెటరీ ఒక వాట్సప్ గ్రూప్ క్రేయేట్ చేసి అధికారులతో సమన్వయం చేసుకోవాలని వేముల సూచించారు. ప్రతి అంశంపై సభ్యులందరు కులకశంగా మాట్లాడి సభ అర్థవంతంగా సజావుగా సాగడానికి అసెంబ్లీ లోపల, బయట పోలీసుల పాత్ర ఎంతో ముఖ్యం అని అన్నారు. ఈ సమావేశాలు కూడా గత సమావేశాల మాదిరిగా సజావుగా సాగడానికి పోలీస్ విభాగంలోని అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలన్నారు. శాసన సభ సమావేశాలు పూర్తి అయ్యేవరకు సమన్వయం కోసం సెక్రటరీ , పోలీస్ ముఖ్య అధికారుల తో కలుపుకొని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలని మంత్రి పేర్కొన్నారు.
ఈ సమావేశంలో హోం ప్రిన్సిపల్ సెక్రటరీ-రవిగుప్తా, డిజి ఉమేష్ షరాఫ్, హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, డిజి (లా & ఆర్డర్) జితేందర్, అడిషనల్ సిపి (క్రైం) షీకా గోయల్, జాయింట్ సిపి(సెంట్రల్ జోన్) విశ్వ ప్రసాద్, సైబరాబాద్ పోలీసు కమీషనర్ స్టిఫెన్ రవీంద్ర, అడిషనల్ సిపి (రాచకొండ) సుదీర్, డిఐజి (ఇంటలిజెన్స్) శివకుమార్, ఇంచార్జి డిఐజి తప్సిన్ ఇక్బాల్, డిసిపి (ట్రాఫిక్) భాస్కర్, రీజనల్ ఫైర్ ఆఫీసర్- పాపయ్య, అసెంబ్లీ ఛీఫ్ మార్షల్ కర్ణాకర్, తదితరలు పాల్గొన్నారు.